4 శాపం
రోజు 2 రోజు
ఉదయం సూర్యోదయం అవుతుంది ⛅️
సత్య తెల్లటి దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాడు
పక్కన ఫోన్ రింగ్ అవుతాది
దుప్పటి తియ్యకుండా ఒక చెయ్యి బయట పెట్టి
ఫోన్ పట్టుకుని మళ్ళీ చెయ్యి దుప్పటి లో పెట్టేసి
హలో అంటాడు 5 సెకన్లు మౌనంగా వింటాడు
6వ సెకను స్లో గా లేచి ఫ్రెషప్ అయ్యి
కూల్ గా జాబ్ కి బయల్దేరతాడు
బైక్ దగ్గరకి వెళుతుంటే
ఒక పిలోడు: సత్య సత్య సత్య అని పిలిస్తే పటించుకోడు
సత్య: సడెన్ గా వెనక్కి తిరిగి ఏంటి అని అరుస్తాడు పిల్లోడు: జోక్
సత్య: హా అని అరుస్తాడు
పిల్లోడు: భయం తో ఏం మాట్లాడడు
సత్య: బైక్ మీద వెళ్లిపోతాడు
పిల్లోడు చూస్తు ఉండి పోతాడు
ట్రాఫిక్ జామ్అయితే
టైం చూసుకుని ఇంకా 20నిమిషాల ఉందీ అనుకుంటాడు
ఆఫీసు లోకీ వచ్చి కూర్చుంటే
సహోద్యోగి హాయ్ అని స్మైలీ ఫేస్ పెట్టాడు
సత్య చూడడు మాట్లాడడు పటించుకోడు సీరియస్ గా పని చేస్తాడు
సత్య ఫోన్ మోగుతుంది కట్ చేస్తే ✂️✂️
శ్రీను: అరె నేను పని మీద బెంగళూరు వెళ్తున్నా రావటానికి 4 రోజులు పడుతోంది
సత్య: సరే నువ్ జాగ్రత్త బై అని కట్ చేస్తాడు
WALL CLOCK లో 6pm అవుతుంది
HR: వచ్చి కొంచెం ఈ ఫైల్ ఫినిష్ చేసి వెళ్లు
సత్య: సారీ సర్ టైం అయిపోయింది రేపు చూద్దాం లే అని వెళ్లిపోతాడు
2 సెకన్ల తర్వాత అందరు వెళ్లిపోతారు
పార్కింగ్ వెళ్లి రేసింగ్ లా వెళతాడు
సత్య కళ్ళలో ఏ కంగారు, తొందర లేదు
ఎప్పుడూ ఏదో అనుమానం గా
ఏదో ఆలోచిస్తూ ముఖం పెడతాడు
కానీ కూల్ ఉంటాడు
కట్ చేస్తే ✂️✂️ ఇంటికి వచ్చాక
ప్రసాద్: హేయ్ బ్రో, ఏంటి సంగతి
సత్య: ఫ్రెషప్ అయి వస్తా కాఫీ కి వెళ్దాం
కట్ చెస్టే ✂✂
సత్య: బైక్ తీస్తావా?
ప్రసాద్: వద్దు పక్కనే కదా నడుచుకుంటూ వెళ్దాం
సత్య: సరే అంటాడు నడుస్తూ
ప్రసాద్: ఐనా నాకు డ్రైవింగ్ కూడా రాదు
కట్ చెస్టే ✂✂✂ కాఫీ షాప్ ☕️
కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు
సత్య: ఇక్కడ కాఫీ☕ చాలా బాగుంటది
ఈ చుట్టుపక్కల ఎవరైనా ఇకడికే వస్తారు
ప్రసాద్: ఓహ్ అవునా అని కొంచెం తాగి నిజమే బ్రో కాఫీ అదిరింది అంటాడు
సత్య: నీ గురించి చెప్పు బ్రో మీది ఏ వూరు?
ప్రసాద్: మా వూరు…!!!!
సత్య: ఏంటి బ్రో మీది ఏ వూరు అంటున్నా?
ప్రసాద్: అదే బ్రో గుర్తు రావట్లేదు
సత్య: మీ అమ్మా నాన్న?
ప్రసాద్: గుర్తు లేదు బ్రో
సత్య: రాత్రి ఆక్సిడెంట్ లో తలకి ఏమైన తగిలిందా?
ప్రసాద్: షాక్ ముఖం పెడతాడు
సత్య: పోనీ ఫ్రెండ్స్ ఎవరైనా…?
ప్రసాద్: నాకు ఎవరూ గుర్తు లేరు బ్రో
సత్య: నీ పేరూ?
ప్రసాద్: ప్రసాద్ రాత్రి చెప్పా కదా
సత్య: అదొక్కటే గుర్తుందా?
ప్రసాద్: హా, నీ పేరేంటి బ్రదర్?
సత్య: సత్య నీకు గతం గుర్తు వచ్చే వరకు నువ్వు నాతోనే ఉండు we’re friends now అంటాడు
ప్రసాద్: thanks రా అని చేయి లాక్కొని షేక్ హాండ్ ఇస్తాడు
సత్య: సీరియస్ లుక్ ఇస్తాడు
inside (వీడెంటే అప్పుడే రా అనేస్తున్నాడు అన్నట్టు)
✂️ కట్ చెస్టే బయటకి వచ్చేస్తారు
ఇంటికి వెళ్ళే దారిలో
ప్రసాద్ దూరం నుండి ఒక అమ్మాయిని చూస్తాడు
చూసి ఫ్లాట్ అయిపోతాడు
ప్రసాద్: రేయ్ మామా చూడు అక్కడ ఒక అమ్మాయ్ సూపర్ ఉంది
సత్య: హా ఉంది అస్సలు పట్టించుకోడు
మొబైల్ చూస్తు నడుస్తాడు
ప్రసాద్: నేను ఫ్లాట్ రా అంటాడు
అపుడు Heroin లెఫ్ట్ లో ఉన్నా తన ఫ్రెండ్ ఫరీనా తో మాట్లాడుతుంది
ఇంతలో రైట్ సైడ్ లో 3గురు నిబ్బ రౌడీ లు
బైక్ పై వచ్చి ఏదో కామెంట్ చేస్తారు
ఒక్కసారిగా వాళ్ల వైపు చూస్తుంది సీరియస్ గా
వాళ్ళు బయపడి బైక్ రేజ్ చేసి పారిపోదాం అనుకుంటారు
Heroin వాళ్లకు శాపం పెడుతుంది
కొడకల్లారా అని అరిచి పక్కన ఫ్రెండ్ ఫరీనా తో కుక్కల్ని కొట్టినట్లు కొట్టాలి ఇలాంటి వెధవల్ని అంటుంది
తను శాపం పెట్టిన 5సెకన్లలో ఓ కారు కి స్క్రాచ్ ఇస్తారు
ఫ్రంట్ వీల్ గార్డ్ ఊడిపోయి
రోడ్డు పై కాయిన్ 滋 తిప్పినట్లు తిరుగుతాది
కార్ వాడు హారన్ కొడతాడు
ఐనా ఆగరు
సత్య, ప్రసాద్ వైపు పోతునే ఉంటారు
ఇదంతా చూస్తున్న ప్రసాద్ పక్కన ఉన్న పైప్ తీస్కోని బైక్ డ్రైవ్ చేస్తున్న వాడిని కొడతాడు దెబ్బకి 3గురు ఎగిరి వెనుక కారు దగ్గర పడతారు
అక్కడ కార్ ఓనర్ ఇంకా జనం 3గురు నిబ్బ రౌడీలని కొడతారు
అటువైపు నుంచి వస్తున్న Heroin 3గురు నిబ్బ రౌడీలను చూసి నవ్వుకుంటూ వెళ్లిపోతాది
సత్య షాక్ లో ఉంటాడు
ప్రసాద్ లవ్ మూడ్ లో ఉంటాడు
✂️ కట్ చెస్టే రాత్రి ఇంట్లో సత్య, ప్రసాద్ ఉంటారు
ప్రసాద్: మామా రేపు ఐ లవ్ యూ చెప్పేస్తా
సత్య: ఎలారా ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలీదు ప్రసాద్: నువ్వే చెప్పావ్ గా చుట్టుపకల ఎవరైన కాఫీ☕ కోసం ఇక్కడకే వస్తారు అని
రేపు వెళ్లి ఐ లవ్ యూ❤蘭 చెప్పేస్తా
సత్య: ఆల్ ది బెస్ట్ అంటాడు
✂️ కట్ చెస్టే హాస్టల్ లో
Heroin 4 స్నేహితులు ఉంటారు
అందరు అనాథలే Heroin ఇవాళ జరిగిన సీన్ చెప్పుతుంది 3గురు నీ కొడితే వచ్చి కారు దగ్గర పడ్డారు వాడెవడో కానీ వెరీ డైనమిక్ అని చెప్తాది
స్నేహితులు: ఏంటే పడిపోయావా ఏంటి
Heroin: అవునే కానీ మనకు వాడెందుకు పడతాడే? అంటాది (ఎందుకంటే Heroin చాలా నెగెటివ్ తనకి ఆత్మవిశ్వాసం చాల తక్కువ)
స్నేహితులు: నీకేం తక్కువే నువ్వు చాలా అందంగా ఉంటావు అంటారూ రేపు నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి అంటారు
Heroin: నేనా..? నోనోనోనో
స్నేహితులు: చెప్పాలి చెప్పాలి అంటుంటే
Heroin: సరే చెప్తాలే (మనసులో చెప్పిన కాని అంగీకరించాలి అనుకుంటుంది)
రేపు ప్రపోజల్ లో….. ఇంకా ఉంది…